J.SURENDER KUMAR,
చారిత్రిక నేపథ్యం గల మంథని లోని రావుల చెరువు కట్ట గణపతి మంటపంలో శుక్రవారం జరిగిన గణపతి హోమంలో ఐటి పరిశ్రమ శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొన్నారు.

మంథని మున్సిపల్ పరిధిలోని విశ్వబ్రాహ్మణుల వాడ, మందాట మర్రివాడ, మార్కెట్ ఏరియా, మసీదు వాడ, గాంధీ చౌక్, సత్య సాయి బాబా ఏరియా,

పేoజర్ కట్ట రెడ్డి ఫంక్షన్ హాల్ లో హమాలి సంఘం, మహాలక్ష్మి టెంపుల్ ఏరియా, లక్ష్మీనారాయణ గుడి వీధి, ఎరుకల గూడెం, హనుమాన్ టెంపుల్ లో, రేణుక ఎల్లమ్మ దేవాలయం, గంగ పురి, గణేష్ నగర్, రంగయ్య పల్ల లో గణపతి మండపాలను దర్శించుకుని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.


విఘ్నాలు తొలగించే వినాయకుని కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గణేష్ ఉత్సవ నిర్వాహకులను కోరారు.

ఈ పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఇదే సంతోషంతో నిమజ్జనం కార్యక్రమం కూడా నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు.