👉 డి.జే లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు !
👉 జాతీయ మెగా లోక్ ఆధాలత్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి !
👉 నేర సమీక్ష సమావేశంలో జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ !
J SURENDER KUMAR,
ఈ నెల 27 వ తేదీన ప్రారంభంకానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు సూచించారు.
ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు. సీసీటీవీలపై దృష్టి సారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్ మండపం నిర్వాహకుల కమిటీ వివరాలు తీసుకోవాలని సూచించారు. వినాయక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచాలని సూచించారు.
అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ శోభయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన పోలీసులతో బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన స్విమర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయoతో నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
👉 డి.జే లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా !
గణేష్ మండపాల వద్ద, శోభాయాత్రలో నిబంధనలు విరుద్ధంగా డి.జే లు,అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంల పై పూర్తి స్థాయిలో నిషేధం ఉందని, నిబంధనలు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డి.జే యజమానులతో పాటు మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ప్రజా జీవనానికి భంగం కలిగిస్తూ తరచూ గొడవలకు పాల్పడే వారిని సంబంధిత తాసిల్దార్లు ముoదు బైండోవర్ చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.
👉 పెండింగ్ కేసులు !
పెండింగ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు.
దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని సూచించారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచి బోర్డ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో తీసుకున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నివారించగలిగామని అన్నారు.
👉 సెప్టెంబర్ 13 న జాతీయ మెగా లోక్ ఆధాలత్ ..
సెప్టెంబర్ 13 న జరిగే జాతీయ మెగా లోక్ ఆధాలత్ ని ప్రజలు సద్వినియోగం చేసుకునేల అధికారులు అవగాహన కల్పించాలని, గుర్తించిన పెండింగ్ కేసులల్లో అన్ని పరిష్కరం అయ్యే విధంగా ప్రతి అధికారి కృషి చేయలని సూచించారు.
ఈ సమావేశంలో డిఎస్పీలు వెంకటరమణ,రఘు చంధర్, రాములు, వెంకట రమణ మరియు DCRB,SB,IT CORE ,CCS, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు,కిరణ్ కుమార్ ,వేణు మరియు సి.ఐ లు,సుధాకర్ , కరుణాకర్ ,రామ్ నరసింహారెడ్డి,సురేష్ , అనిల్ కుమార్ మరియు ఎస్.ఐ లు,DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.