J.SURENDER KUMAR,
దేశం గర్వించదగిన గిరిజన నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
👉 శిబుసోరెన్ స్వంత గ్రామం జార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లాలోని నమ్రాలో శనివారం సంప్రదాయ గిరిజన ఆచారాలతో నిర్వహించిన దిషోం గురు శ్రద్ధాంజలి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.
👉 ఈ సందర్భంగా శిబుసోరెన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు. శిబు సోరెన్ జార్ఖండ్ కు మాత్రమే కాకుండా దేశంలోని గిరిజన, అణగారిన వర్గాల పక్షాన బలమైన స్వరం వినిపించారని, వారి జీవితం ఆ వర్గాల కోసం అంకితం చేశారని కొనియాడారు.

👉 గిరిజన సమాజ ప్రయోజనాల కోసం స్వర్గీయ శిబుసోరెన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
👉 ఈ సందర్భంగా మాజీ సీఎం శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.