👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గిరిజన గ్రామ పంచాయతీలలో ప్రతి తండాకు అనుసందానం లేని రోడ్లు, సిసి రోడ్లు నిర్మాణము, పారశాలలలో తరగతి గదులు, వంట గది మరియు టాయ్ లెట్స్ నిర్మాణము, అంగన్ వాడి కేంద్రాల భవన నిర్మాణము, కమ్యూనిటి భవనములు, తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹ 81 కోట్ల అంచనాలతో మిగిలి మంజూరు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు.
జగిత్యాల జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికై మౌళిక సదుపాయాల కల్పన పై శుక్రవారం సమీక్షా సమావేశ అనంతరం మీడియా సమావేశంను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరి శ్రీమతి అలగు వర్షిని నిర్వహించారు.
మహిళాశక్తి భవనములు, విద్యుత్, వీది దీపాల సదుపాయలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు, పశువైద్య శాలల నిర్మాణము, లైబ్రరీలు, బస్ షెల్టర్స్ ఏర్పాటు మొదలైన అన్ని రకాల మౌళిక వసతుల నిర్మాణము కొరకు కావలసిన నిధులు ₹ 81 కోట్లు అంచనాలను సమీక్షించి, అంశాల వారిగా వాటి కాలసిన నిధులను మంజూరి చేస్తానని మంత్రి తెలిపారు. మెరుగైన సదుపాయాల కోసం కావలసిన ప్రణాళికలను సిద్ధం చేయాల్సిందిగా మంత్రి కలెక్టర్ కు సూచించినారు.
జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ, జగిత్యాల ఆధ్వర్యములో గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరి శ్రీమతి అలగు వర్షిని అధ్యక్షతన జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ది కోసం మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లాలోని వివిధ సంబంధిత శాఖల అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండలాల వారిగా విద్యా, వైద్యం, విద్యుత్, రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజ్ మొదలైన అంశాల వారిగా ఉన్నటువంటి వసతులు వాటి స్థితిపై అధికారులు సమర్పించిన నివేదికలకు పరిశీలించినారు.
ఈ సమావేశము లో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్,
అదనపు కలెక్టర్ జగిత్యాల, శ్రీమతి బి.ఎస్.లతా, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కె.రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ & బి, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ఆర్డీవోలు, డి ఆర్ డి ఓ జగిత్యాల , జిల్లా వైద్యాధికారి, వివిధ శాఖల అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.