గోదావరి వరదలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఎడతెరిపి లేకుండా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరి నదిలోకి వస్తున్న భారీ వరద దృష్ట్యా అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టి,  మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి గోదావరి తీరాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.

మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు గోదావరి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పవిత్ర నదిలో స్నానాల కోసం వచ్చే  భక్తులు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే తనకు సమాచారం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

👉 జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు !

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ ఇందిరా భవన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు .

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి  జీవన్ రెడ్డి తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొని  రాజీవ్ గాంధీ  చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

👉🏻 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు !

ధర్మారం మండలం సాయంపేట గ్రామానికి చెందిన దివ్యాంగుడు సిలువేరి సత్తయ్య మంత్రి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

బ్యాటరీ సైకిల్ లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి జిల్లా అధికారులతో మాట్లాడి బ్యాటరీ సైకిల్ బుధవారం మంజూరు చేయించారు.