గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభ గుర్తింపుకు వేదిక !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభ గుర్తింపుకు వారికి సరైన వేదికలు కల్పించాలనే లక్ష్యంతోనే అనువైన క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నామని. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది, అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.


👉 గొల్లపెల్లి మండల యువకులు గతకొంతకాలంగా క్రీడా మైదానానికి స్థలం లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం  మంత్రి  దృష్టికి తీసుకువెళ్లారు.


👉 స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ , రెవెన్యూ మంత్రి, మరియు జిల్లా కలెక్టర్‌లతో చర్చించి, క్రీడా మైదాన నిర్మాణం కోసం ఏడు ఎకరాల భూమిని కేటాయించారు.


👉 ప్రొసీడింగ్ పత్రాలను యువకులకు ఇటీవలే అందించారు బుధవారం క్రీడా మైదానానికి భూమి కేటాయింపు  నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.