👉 జూమ్ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం అన్ని జిల్లాల ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..
గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు.

👉 హాస్టళ్లు, గురుకులాల వద్ద తాగునీరు, ఆహారం, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
👉 ఎక్కడైనా నీరు నిల్వ లేకుండా పరిశుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవసరమైతే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
👉 గురుకులాల్లో చదువుతున్న పిల్లలు మన భవిష్యత్తు. వారి ఆరోగ్యం, భద్రత, చదువు విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదు.
👉 ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వెంటనే నా దృష్టికి తీసుకురావాలి అని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులు ప్రస్తుత పరిస్థితులపై వివరాలను మంత్రికి వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ కు అధికారులు హామీ ఇచ్చారు.