ఐజేయు అధ్యక్ష కార్యదర్శులు పదవులకు నామినేషన్ లు !

👉 పాట్నాలో నామినేషన్ల దాఖలు !

J.SURENDER KUMAR,

త్వరలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఎన్నికల్లో జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు సోమవారం పాట్నాలో నామినేషన్లు దాఖలా చేశారు. అధ్యక్ష కార్యదర్శి అభ్యర్థులుగా బరిలో  బల్విందర్ సింగ్ జమ్ము, డి.సోమసుందర్ నామినేషన్ వేశారు.


తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే), ఆంధ్రప్రదేశ్  యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే)లతో పాటు 17రాష్ట్రాల జర్నలిస్టుల సంఘాలు ఈ నామినేషన్లను బలపరిచాయి.


ఐజేయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎస్.ఎన్. సిన్హాల సమక్షంలో, పాట్నాలో ప్రధాన ఎన్నికల అధికారి మహేష్ సిన్హాకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు, ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు  అమర్ మోహన్ ప్రసాద్, బీహార్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి కమల్ కాంత్ సహాయ్ తదితరులు పాల్గొన్నారు.

👉 ఐ జె యు అధ్యక్షుడిగా, బల్విందర్ సింగ్ జమ్ము,
ప్రధాన కార్యదర్శిగా,

👉డి.సోమసుందర్  లు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.