ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కడు పేదలకు ప్రాధాన్యత !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని, కేటాయింపులో అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ,దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అన్నారు.

జూలపెల్లి మండలం అబ్బాపూర్ లో   మంగళవారం18 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ అందించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

విడతల వారీగా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని, సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేల చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు.

బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్ల, దృష్టికి తీసుకెళ్లాలని,వారు ఆన్ లైన్ లో నిర్మాణ దశను తెలియజేసి ప్రభుత్వం నుండి బిల్లులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు,  అర్హత ఉండి ఇళ్లు రాని వారు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్
తెలిపారు.