J SURENDER KUMAR,
పోలీస్ శాఖలో విశేషమైన సేవలు అందించిన జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయ్యారు.
విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని, ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయినా స్పెషల్ బ్రాంచ్ ఏ ఏ ఎస్ ఐ రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ ఐ గా విదులు నిర్వహిస్తున్న రుద్ర కృష్ణకుమార్ ను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 11 మంది పోలీస్ అధికారులు ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికయ్యారు అందులో ఇద్దరు జిల్లా పోలీసు అధికారులు ఎంపిక కావడం అభినందనీయం .
👉 ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ !

1989 లో కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరి 2012 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి మరియు 2019 లో ASI గా పదోన్నతి పొందారు. 2012 సంవత్సరంలో రాష్ట్ర పోలీసు సేవా పథకంకు మరియు 2019 లో ఉత్తమ సేవా పథకం కు ఎంపిక అయ్యారు. 36 సంవత్సరాలు గా ఎలాంటి రిమార్క్ లేకుండా పోలీస్ శాఖలో అందిస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక అయ్యారు.
👉 ఏ ఎస్ ఐ రుద్ర కృష్ణ కుమార్ !

1989 లో కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరి 2017 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి మరియు 2021 లో ASI గా పదోన్నతి పొందారు..
2022 సంవత్సరంలో రాష్ట్ర పోలీసు సేవా పథకం కు ఎంపిక కావడం జరిగింది. 36 సంవత్సరాలు గా ఎలాంటి రిమార్క్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక కావడం జరిగింది.
వీరి ఎంపిక పట్ల పోలీస్ సంక్షేమ శాఖ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.