👉 మెట్టుపల్లి ఆర్డీవో ను ఆదేశించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్, మానవీయ వేదన !
J.SURENDER KUMAR,
దారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జగిత్యాల ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడైన రాజగంగారాం సమస్యను 24 గంటల్లో పరిష్కరించి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మెట్టుపల్లి ఆర్డీవోను ఆదేశించారు.
👉 జగిత్యాల ప్రజావాణి కి వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేట కు చెందిన దివ్యాంగుడు రాజగంగారాం ను సిబ్బంది బలవంతంగా బయటకు పంపిన విషయం పై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ సిబ్బంది దివ్యాంగుడి పట్ల వ్యవహరించిన తీరుపై చింతిస్తున్నట్లుగా తెలుపుతూ స్పందించారు.
👉 జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నుంచి మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ తో మంత్రి ఫోన్లో మాట్లాడారు.
👉 మంగళవారం ఉదయం 11 గంటలకు మీరు నేరుగా రాజగంగారాం ఇంటికి వెళ్లి ఈ విషయంలో విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
👉 దివ్యాంగుడైన రాజగంగారం తన సమస్య పై మరోసారి ప్రజావాణి కి రాకుండా 24 గంటల్లో పరిష్కారం చూపి తనకు వ్యక్తిగతంగా నివేదిక ఇవ్వాలన్నారు.
👉 దారి అనేది భూమికి సంబంధించిన అంశం ఇది రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఇతరుల పట్ట భూమి అయినా, దివ్యాంగుడి ఇంటి దారి కోసం భూసేకరణ చట్ట ప్రకారం సేకరించండి నష్ట పరిహారం ప్రభుత్వ పరంగా చెల్లిస్తాను అని అన్నారు.
👉 మీకుఏదైనా ఇబ్బంది ఉంటే అవసరం అయితే తాను జిల్లా అధికారులతో మాట్లాడతానని ఆర్డీవోకు సూచించారు.
👉 దివ్యాంగుడి పట్ల ఓ కానిస్టేబుల్ ఇబ్బందికరంగా ప్రవర్తించిన తీరుకు చింతిస్తున్నానని, తన మాటగా ఆ కుటుంబానికి తెలిపి పెద్ద మనసుతో ఈ సమస్య పులిస్టాప్ పెట్టాల్సిందిగా జిల్లా మంత్రిగా నేను కోరినట్టు నా మాటగా వారి కుటుంబ సభ్యులకు చెప్పండి అంటూ ఆర్డీవోకు మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. మీడియా సమావేశంలో దివ్యాంగుడి సంఘటన పట్ల మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.