జగిత్యాలలో ₹ 203 కోట్ల తో నూతన ఆసుపత్రి మంజూరు!

👉 జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ !


J SURENDER KUMAR,

జగిత్యాల లో ₹ 203 కోట్ల తో నూతన ఆసుపత్రి మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహకు  జగిత్యాల ప్రజల పక్షాన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

జగిత్యాల మోతే పార్టీ కార్యాలయం లో జగిత్యాల పట్టణం, రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ₹ 36 లక్షల 66వేల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.


జగిత్యాల కు మెడికల్ కాలేజీ  మంజూరు చేసుకొని రాష్ట్రములో  మొదటి అనుమతి జగిత్యాల కు తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యదిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయటం జరిగింది అని ఎమ్మెల్యే అన్నారు.

20కోట్ల నిధులు మెడికల్ కాలేజీ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంజూరు చేశారు అని కొత్త రేషన్ కార్డులు మంజూరు తో ప్రజలకు  ఆహార భద్రత, సంక్షేమ పథకాలు అందుతాయి.ఇందిరమ్మ ఇళ్ల మంజూరు తో సొంతింటి కల సాకారం కానుంది వివరించారు.

నూకపల్లి లో అసంపూర్తి గా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు  నిధులు మంజూరు తో నిరుపేదలకు లబ్ది చేకూరుతుంది అభివృద్ది విషయంలో అందరూ కలిసి పనిచేయాలి. అభివృద్ధికి అడ్డు పడితే ప్రజలు క్షమించరు రోగం వచ్చాక చికిత్స కన్నా  ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని ఎమ్మెల్యే అన్నారు


సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం అని మత్తుపదార్తాల నియంత్రణ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారు. మత్తుపదార్థాల వాడకం లో పిల్లల ప్రవర్తన విషయంలో తల్లి దండ్రులు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.