జనహిత పాదయాత్రను విజయవంతం చేయండి !

👉 వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరే విధంగా, వర్ధనపేట నుండి ఈ నెల 25 న సాయంత్రం ప్రారంభం కానున్న జనహిత పాదయాత్ర విజయవంతం చెయ్యాలని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  జనహిత పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో  మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

పాదయాత్రలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్  తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు అని మంత్రులు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు