👉 జగిత్యాల జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి !
J SURENDER KUMAR,
సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ లో ప్రజలు విస్తృతంగా పాల్గొని, తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని జగిత్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి విజ్ఞప్తి చేశారు.
శనివారం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, పీపీలు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం జరిగింది.
👉 ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ..
నేషనల్ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్య లో కేసులను పరిష్కరించాలని కోరారు. రాజీకి అనుకూలమైన అన్ని క్రిమినల్, సివిల్ కేసుల ను ఇరు పార్టీల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని అన్నారు. పోలీస్ అదికారులు తమ పోలీస్ స్టేషన్‌ల వారీగా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

రాజీకీ వీలున్న క్రిమినల్ కేసుల్లోని కక్షిదారులు భవిష్యత్తులో ప్రశాంత జీవనం కోసం తమ కేసుల పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. జిల్లా న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, సంబంధిత శాఖలు సమన్వయంతో ఈ మెగా లోక్ అదాలత్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ , మొదటి అదనపు జిల్లా జడ్జి నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ, డిఎస్పి లు వెంకటరమణ, రఘుచందర్ ,రాములు ,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు మరియు న్యాయవాదులు, పోలీస్ అదికారులు పాల్గొన్నారు.