కాలేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో…

J.SURENDER KUMAR,

కాలేశ్వరం పై ఘోష్‌ కమిషన్‌ నివేదికపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా జరిగిన చర్చల అంశాలలో కొన్ని..

👉 మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి !

తెలంగాణ ఏర్పడ్డాక అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరంను మొదలుపెట్టారు. 20 నెలలుగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నాయి.

👉 మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి !

₹ 87,449 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టుకు గుండెకాయ అయిన మేడిగడ్డ కుంగింది. ₹ 21 వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు. ప్రాణహితపై 2014 నాటికే ₹10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.

👉 మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి !

వాప్కోస్‌ రిపోర్ట్‌ కంటే ముందే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని అప్పటి ప్రభుత్వం డిసైడయ్యింది. వాప్కోస్‌ రిపోర్ట్‌ ఇచ్చినరోజే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని ఆదేశించింది. ఏడాది 195 TMCల నీళ్లను ఎత్తిపోస్తామని చెప్పారు. ఐదేళ్లు కలిపి 125 TMC నీళ్లను మాత్రమే ఎత్తిపోశారు. ఇందులో 35 TMCల నీళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. లక్షకోట్లతో కట్టిన ప్రాజెక్టుతో ఐదేళ్లలో వాడుకున్న నీళ్లు 101 TMCలు మాత్రమే.

👉 హరీష్‌ రావు !

650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా.? వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరాం. వరద మాకు ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుంది. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధం. –

👉 హరీష్‌ రావు !

కేసీఆర్‌కు, నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు నోటీసులు ఇవ్వలేదు. ఘోష్‌ కమిషన్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడింది. కమిషన్లను పొలిటికల్‌ వెపన్‌గా వాడుకోవద్దని కోర్టులు గతంలోనే చెప్పాయి. నిబంధనలు అనుసరించలేదనే కోర్టకు వెళ్లాం. ఆదివారం రిపోర్ట్‌ పెట్టారంటేనే కుట్ర ఉన్నట్టు. అందుకే సుప్రీంకోర్టులో సీఎం కేవియేట్‌ వేశారు. కోర్టులో వాదనలు ఉన్నాయనే ఆదివారం కూడా చర్చ పెట్టారు. పారదర్శకంగా విచారణ జరగకపోతే చిత్తు కాగితంతో సమానమని కోర్టులు చెప్పాయి.

👉 సీఎం రేవంత్ రెడ్డి !

ప్రాణహిత-చేవెళ్లలో నీళ్లు ఉన్నాయని ఉమా భారతి చెప్పారు. హరీష్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.

👉 హరీష్ రావు !

రిపోర్టును క్యాష్ చేయాలని మేము కోర్టుకు వెళ్ళాం.. సభలో చర్చ చేయొద్దని కోర్టుకు వెళ్లలేదు. అప్పుడు కేసీఆర్ కాళేశ్వరంపై సభలో ప్రజెంటేషన్ ఇస్తే ప్రిపేర్ కాలేదని ఉత్తం పారిపోయారు. మా ఉత్తం ప్రిపేర్ కాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నారు.

👉 హరీష్ రావు !

తెలంగాణ వచ్చిన తర్వాత నేను మహారాష్ట్రకు వెళ్లాను. తుమ్మిడిహెట్టి దగ్గర అనుమతి ఇవ్వలేమని ఆనాటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. రిపోర్టును క్యాష్ చేయాలని మేము కోర్టుకు వెళ్ళాము. ఉమాభారతి రాసిన లేఖలో మొదటి పేజీని మాత్రమే కమిషన్ చదివింది.

👉 హరీష్ రావు !

మూడో పేజీలో నీళ్లు అందుబాటులో లేవని ప్రస్తావించిన విషయాన్ని కమిషన్ పట్టించుకోలేదు. అందుకే చెత్త కమిషన్ అంటున్నా. ముఖ్యమంత్రి కూడా మూడో పేజీ చదవలేదు. సీఎం సభను తప్పుదోవ పట్టించారు, క్షమాపణ చెప్పాలి.

👉 సీఎం రేవంత్ రెడ్డి

హరీష్ రావు తప్పును బయటపెట్టారు కాబట్టి పీసీ ఘోష్ ను టార్గెట్ చేశారు. తప్పులకు కారణం హరీష్ రావు అని కమిషన్ చెప్పింది. ఏం విచారణ కోరుకుంటున్నారో చెప్పండి. సిబిఐ కావాలా? సిట్ కావాలా? ఏసీబీ కావాలా? మీరు సత్యహరిశ్చంద్రుడి కుటుంబ సభ్యులు అయితే నిజాయితీని నిరూపించుకోండి.. చెప్పిన అబద్ధాన్ని హరీష్ రావు మళ్లీ మళ్లీ చెబుతున్నారు:

👉 సీఎం రేవంత్ రెడ్డి !

2009, 2014 లేఖ ప్రకారం నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్లకు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ నీళ్లు ఉన్నాయా అని ఎందుకు అడిగారు? ఉన్నాయనే కేంద్రం చెప్పింది. అయినా ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. తప్పుడు పనులు చేసి లక్ష కోట్లు కొట్టేయ్యాలని చూశారు.

👉 సీఎం రేవంత్ రెడ్డి !

అప్పట్లో చర్చ అంతా ప్రాజెక్టు ఎత్తు దగ్గరే వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తులో కట్టుకోవాలని చెప్పింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 152 మీటర్ల దగ్గర కట్టుకుంటామని చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదు.

👉 సీఎం రేవంత్ రెడ్డి !

80 వేల పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు తొలిచిందో తెలియదు. కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. 2005లోనే ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని టీఆర్ఎస్ అభినందించింది. మీరు నియమించుకున్న రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మేడిగడ్డ దగ్గర కట్టొద్దని చెప్పారు. ఆ రిపోర్టును కూడా తొక్కిపెట్టారు.

👉 సీఎం రేవంత్ రెడ్డి !

నిజాం కంటే ధనవంతుడు కావాలని కేసీఆర్ ప్రాజెక్టుకు రీడిజైన్ చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి మెడిగడ్డకు తరలించడమే వారి ఉద్దేశం. రిపోర్టు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారు. నిద్రపోతున్నట్టు నటించే మీలాంటి వారిని లేపే తెలివితేటలు నాకు ఉన్నాయి.

👉 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

₹.600 కోట్లు ఖర్చు చేసినప్పుడు రీడిజైన్ ఎందుకు ఆలోచించలేదు. తుమ్మిడిహెట్టి వద్దనుకున్న మీరు ఎందుకు ఖర్చు చేశారు? ఎలా లక్ష కోట్లు కొల్లగొట్టాలన్నదే వారి లక్ష్యం. మిలా మాయమాటలు చెప్పను:

👉 హరీష్ రావు !

మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎలా వచ్చాయని జూపల్లి అడిగారు.. మేడిగడ్డ దగ్గర 248 TMCల నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో CWC రిపోర్ట్ ఇచ్చింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు 116 కి.మీ. దూరం ఉంది. మహారాష్ట్ర నుంచి 16 వాగులు వస్తాయి. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా సాధ్యం కాదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది.

👉 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి !

లక్ష కోట్ల ప్రాజెక్టును నాశనం చేసి నవ్వుతున్నారు. నవ్వడానికి సిగ్గుండాలి. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం దోచుకోవడానికే. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు హరీష్ చెప్పే నివేదిక ఎక్కడా లేదు. కుట్రతోనే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం.

👉 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి !

వెదిరె శ్రీరామ్ ఇచ్చిన అఫిడవిట్ గురించి హరీష్ ఎందుకు మాట్లాడరు? కేంద్ర ప్రభుత్వ సలహాదారు ఇచ్చిన నివేదికపై ఎందుకు మాట్లాడటం లేదు? తుమ్మిడిహెట్టికి కేంద్రం నుంచి నిధులు కూడా వచ్చాయి. తెలంగాణకు శాశ్వత న్యాయం చేశారు.

👉 హరీష్ రావు !

రిటైర్డ్ ఇంజనీర్ల వేదికను ఘోష్ పట్టించుకోలేదా? ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను ఘోష్ కమిషన్ పట్టించుకోలేదు. అందుకే దీన్ని పీసీసీ కమిషన్ నివేదిక అంటున్నాం. ప్రాణహిత చేవెళ్లకు 2007-08లో టెండర్లు పిలిచి.. 2010లో డీపీఆర్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? డీపీఆర్ తప్పుంటే అనుమతులు ఎలా వస్తాయి ?

👉 హరీష్ రావు

నిజాలు చెబితే భయం ఎందుకు? ఒకే ఏడాదిలో 11 అనుమతులు తీసుకొచ్చాం. NDSA గురించి ఇప్పుడు ఉత్తమ్ గొప్పలు చెప్పారు.  కానీ NDSAపై బిల్లు వచ్చినప్పుడు పార్లమెంటులో ఉత్తమ్ వ్యతిరేకించలేదా? పోలవరం ప్రాజెక్టు పదిసార్లు కూలిపోతే NDSA ఎందుకు వెళ్ళలేదు ?

👉 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

నీళ్ల కోసమే ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం.. మీకు కమిషన్ రిపోర్టుపై పారదర్శకంగా చర్చ జరగాలని లేదా? చెప్పాల్సిందంతా చెప్పి తొండి చేస్తామంటే ఎలా? సభను శాసిస్తామంటే సరికాదు. సభలో చర్చకు వస్తుంటే అల్లరి చేస్తున్నారు. లక్ష కోట్ల దోపిడి చేశారు. కట్టిన పది రోజుల్లోనే కోల్పోతే ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జస్టిస్ ఘోష్ రిపోర్టు పై మాత్రమే మేము మాట్లాడాం. రాజకీయ ఆరోపణలు చేయలేదు, కక్ష సాధింపులు లేవు. జస్టిస్ ఘోష్ పై కూడా హరీష్ రావు అపవాదులు వేస్తున్నారు. కక్ష సాధింపు ఉంటే ఆరోజు చర్యలు తీసుకునే వాళ్లం. ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు?

👉 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

కాళేశ్వరం మీకోసమే.. ప్రజల కోసం కాదు.. కనీసం కేబినెట్ అప్రూవల్ కూడా లేదు. కుంగిపోకముందే NDSA కొన్ని సూచనలు చేసింది. NDSA సూచనలను కూడా పట్టించుకోలేదు.కేసీఆర్ చెప్పారు, హరీష్ రావు కట్టారు.. కమిషన్ మమ్మల్ని పిలవలేదని హరీష్ రావు చెబుతున్నారు. ఎవరైనా రావచ్చని కమిషన్ ఓపెన్ గా ప్రకటనలు ఇచ్చింది:

👉 డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క!

రీడిజైన్ పేరుతో ప్రతి ప్రాజెక్టును చీల్చి చెండాడారు. ఇవన్నీ పెంచి అదనంగా నీళ్లు ఇచ్చారా? మేడిగడ్డ, సుందిళ్ల పనికిరాకుండా పోయాయి. ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదు. హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టు లాగా కుంగిపోయారు. నిటారుగా నిలబడలేక పోతున్నారు.

👉 డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క!

ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పి ఉండాల్సింది. బనకచర్ల సమస్యకు బీఆర్ఎస్సే కారణం. ఈ రిపోర్టుపై ఏం చేద్దాం చెప్పండి. నివేదికను చెత్తబుట్ట అన్నారు, ప్రజలు మిమ్మల్ని ఎక్కడ వేశారో అర్థం చేసుకోవాలి. పదేళ్లు మాకు మైక్ కూడా ఇవ్వలేదు.. అరచి అరచి అలసిపోయాం, కానీ బయటికి పోలేదు.

👉 టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాక్ అవుట్!

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.