J.SURENDER KUMAR,
వ్యవసాయమే 90 శాతం జీవనాధారంగా ప్రజలకు అన్నం పెడుతున్న మున్నూరు కాపులు, రాజకీయపరంగా, వృత్తి పరంగా అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం ఆదివారం స్థానిక పటేల్ గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సాగు నీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అక్కపల్లి రిజర్వాయర్ ఎత్తిపోతల పథకానికి నిధుల మంజూరుకు కృషి చేయడంతోపాటు సాగు నీటికాలువ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సంఘం అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేష్, కార్యదర్శి బండి మహేష్, కార్యవర్గ సభ్యులు సభ్యు లను మంత్రి సన్మానించారు.

ఈకార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ రాష్ట్ర నాయకులు బాదినేని రాజేందర్, పట్టణ మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు సవుల్ల భీమన్న, ఓడ్నాల రాజశేఖర్, బండి మురళి, సంగీ నరసయ్య, రాజశేఖర్, తదితర కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.