👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ తీరుపై చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టక పోవడానికి కారణం ,ఎన్నికల కమిషన్ ప్రధాని మోడీ కంట్రోల్ లో ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
👉 ధర్మపురి పట్టణంలో సోమవారం మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. బీహార్, తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల తీరుపై పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎన్నికల కమిషన్ సమాధానం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.
👉 2014 కు ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ ఆయన కంట్రోల్ లోకి పోయింది, అని అందుకే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడం లేదని మంత్రి ఆరోపించారు.
👉 వంద సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు, భయపడదని ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలో ఉంటాం, ఓడితే ప్రజల్లో ఉంటాం, ప్రజా సంక్షేమం కోసం పోరాడుతాం అని అన్నారు.
అవగాహన లేని కొందరు బిజెపి నాయకులు మీరు గెలవలేక ఆరోపణలు, కమిషన్ పై ఈవిఎంలపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ఏవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు ఎందుకు జరపడం లేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
👉 నేనే ఈవీఎం ల బాధితుడిని !
2018 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి రౌండ్ వరకు 3600 ఓట్ల మెజార్టీతో ఉన్న నేను ఒకటి రెండు ఈవీఎంలు పనిచేయడం లేదని నన్ను 440 ఓట్లతో ఓడించారు అని, నేను క్యాబినెట్ మంత్రిగా చెబుతున్నాను నేనే EVM బాధితుడిని అని అన్నారు.
👉 ఎన్నికల పిటిషన్ విచారణలో ఉండగా ఈవీఎంలు ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ తాళం కీలు కలెక్టర్ వద్ద లేకుండా న్యాయం చేశారని, ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం అని మంత్రి అన్నారు. రానున్న రోజులలో భారత ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీకి దేశ ప్రజలు పట్టం కట్టనున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.