కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని దేవాలయాలను  అభివృద్ధి చేయాలి !

👉 ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గీలోని శివాలయం, వేణుగోపాల స్వామి  ఆలయాలను సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా చాలా గొప్పగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.


👉 కొడంగల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధి, తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి  అధికారులతో మంగళవారం సమీక్షించారు. కొడంగల్‌లోని చారిత్రక శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ఆమోదించారు.


👉 ఈ ఆలయ ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, ముఖ్యంగా ప్రాకార మండపం, మాడ వీధులు, భూ వరాహస్వామి దేవాలయం, గర్భగుడి, మహామండప డిజైన్లలను అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.


👉  దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి  పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.