కొత్త వ్యాపార ఆరంభం తో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి !

👉 ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

కొత్త వ్యాపార ఆరంభం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో, ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన చిలివేరి లక్ష్మణ్  జ్యోతి ఎంటర్‌ప్రైజెస్ ను  ఆదివారం  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ప్రారంభించారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వ మద్దతు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

👉 వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్ బాబు !

కరీంనగర్ లో V కన్వెన్షన్ హాల్ లో మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్  మనువరాలి వివాహ వేడుకల్లో పాల్గొని మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

👉 మంత్రి శ్రీధర్ బాబు  పరామర్శ !


మల్హర్ రావు మండలంలోని వల్లెంకుంట లో
తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ & భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి  తల్లి   ఇటీవల మృతి చెందారు.

మంత్రి శ్రీధర్ బాబు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి  కుటుంబ సభ్యులను పరామర్శించి  సానుభూతి తెలిపారు.