J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు దాదాపు ₹ 65 విలువగల చెక్కులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.
ధర్మారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి , 121 మంది లబ్ధిదారులకు ₹ 41,63,500 లక్షలు, 23 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, ₹ 23,02668 విలువ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

గత ప్రభుత్వ హయాంలో అర్హులకు పంపిణీ చేయని రేషన్ కార్డులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం న్యాయంగా మంజూరు చేస్తోంది మంత్రి అన్నారు. రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నాం,
👉 మహిళల ప్రయాణాన్ని సురక్షితంగా, ఆర్థికంగా స్వాలంబనకు మద్దతివ్వడానికే ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 రైతుల కోసం రైతు బంధు అమలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సాగు పై పెట్టుబడులు పెరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
👉 కౌలు రైతులకు కూడా మద్దతుగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే రైతులపై ఉన్న పాత రుణాలను మాఫీ చేస్తూ రైతుల పై భారాన్ని తగ్గించామని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.