👉 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి !
J.SURENDER KUMAR,
నేను మంత్రి లక్ష్మణ్ కుమార్ ను 1984 నుంచి NSU స్థాయి నుంచి 40 సంవత్సరాలగా దగ్గర నుండి చూస్తున్నాను, మారుమూల నియోజకవర్గం నుంచి మాదిగ సామాజిక వర్గ సామాన్య కార్యకర్త, లక్ష్మణ్ కుమార్, పోరాట వీరుడు అని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, చొరవతో లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వచ్చిందని, భారీ నీటి పారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం రేషన్ కార్డుల పంపిణీ, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి, మంత్రులు ఉత్తమ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ లు పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

మంత్రి లక్ష్మణ్ కుమార్, జెడ్పిటిసి సభ్యుడిగా, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఉమ్మడి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిని అనుభంతో పాటు పార్టీ ని నమ్ముకున్నాడు అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని ఓడిన గెలిచిన, పార్టీలో కొనసాగిన సామాన్య కార్యకర్త లక్ష్మణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని మంత్రి అన్నారు. మీరు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన మొదటిసారి మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఎంపిక చేశారని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన సామాన్య కార్యకర్తకు లభించే గుర్తింపుకు మంత్రుల లక్ష్మణ్ కుమార్ నిదర్శనమని అన్నారు. రాహుల్ గాంధీ చొరవతోనే లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వచ్చిందని పదే పదే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.