మధిర అసెంబ్లీ పరిధిలో MSME పార్కులు ఏర్పాటు చేయండి !

👉 ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క !

J.SURENDER KUMAR,

ఢిల్లీ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
బుధవారం కేంద్ర  మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రి జితన్ రామ్ మాంఝీ మర్యాద పూర్వకంగా కలిసి మధిర నియోజకవర్గంలోని యెండపల్లి & రేమిడిచెర్లలో MSME పార్కుల ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

మంత్రులు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు తమ, తమ  నియోజకవర్గాల్లో పార్కులో ఏర్పాట్లు అవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ, వారితో మాట్లాడుతూ స్థానిక ఉపాధి & వ్యవస్థాపకతను పెంచేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  MSME పార్కు ఏర్పాటుకు మేము కట్టుబడి ఉన్నామనీ  మంత్రులకు  హామీ ఇచ్చారు.