మహానగర అభివృద్ధి – ఆటంకాలు !

👉 ఏడాది కాలంలో హైడ్రా అనే అంశంపై !

👉 టీయూడబ్ల్యూజే మీట్-ది-ప్రెస్ !

J.SURENDER KUMAR,

హైడ్రా కమిషనర్  ఏ.వి.రంగనాథ్ తో శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) “మీట్ – ది – ప్రెస్” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ స్వాగతం పలికారు.  తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి స్వాగతోపన్యాసం చేసారు.

ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, టి యు డబ్ల్యూ జె రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, కార్యదర్శి హమీద్ షౌకత్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్ లతో పాటు
ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలకు చెందిన దాదాపు 90 మంది జర్నలిస్టులు హాజరయ్యారు.