J.SURENDER KUMAR,
మెట్టుపల్లి మాజీ జెడ్పిటిసి సభ్యురాలి కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం పరామర్శించారు. జడ్పిటిసి మాజీ సభ్యురాలి కుమారుడు కాటిపల్లి శ్రీకర్ రెడ్డి బుధవారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువలో వాహన ప్రమాదంలో గల్లంతు అయ్యాడు.

జడ్పీటీసీ మాజీ సభ్యు రాలు కాటిపెల్లి రాధ, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి. తండ్రికి రైస్ మిల్లు వ్యవహారాల్లో చేదోడుగా ఉంటున్నారు. శ్రీకర్ రెడ్డికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు.

కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న రాధ శ్రీనివాస్ రెడ్డి దంపతుల తీరు పలువుడ్ని కంటతడి పెట్టించింది. మంత్రి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సిం గరావు, తదితరులు పరామర్శించారు. కుటుంబాన్ని ఓదార్చారు.