మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు దివ్యాంగుడి సమస్యపై విచారణ !

J.SURENDER KUMAR,

సోమవారం జగిత్యాల ప్రజావాణిలో దివ్యాంగుడు
మర్రిపెల్లి రాజగంగారాం సమస్య పట్ల స్పందించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మెట్టుపల్లి ఆర్డీవో మంగళవారం ముత్యంపేట గ్రామంలో విచారణ జరిపారు.

తన సమస్య పరిష్కారం కోసం, మర్రిపల్లి రాజా గంగారం కలెక్టరేట్ లో బైఠాయించడం, అతడి పట్ల ఓ పోలీసు దురుసు ప్రవర్తన పట్ల మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆగ్రహం వ్యక్తం చేసి 24 గంటల లో రాజా గంగారం ఇంటికి వెళ్లి సమస్య తెలుసుకొని పరిష్కరించాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి విచారణ చేపట్టారు.  ఈ విచారణ లో  ఇరువర్గాల వాదనలు నమోదు చేసి  విచారణ నివేదికను మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ కు సమర్పించారు. విచారణ లో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీవో, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మరియు పంచాయతీ కార్యదర్శి పాలొగొన్నారు.