మంత్రి లక్ష్మణ్ కుమార్ నివాసంలో రక్షాబంధన్ సందడి !

J SURENDER KUMAR,

పవిత్ర రాఖీ పౌర్ణమి సందర్భంగా  ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నివాసంలో శనివారం మంత్రి తోబుట్టువులు  ఆయనకు రాఖీ కట్టి ఆశీస్సులు పొందారు.

వీరితోపాటు స్థానిక,  జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల  పట్టణాలకు చెందిన మాజీ మహిళా కౌన్సిలర్లు  మంత్రికి రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా  ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు, స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందించి వేద ఆశీర్వచనం చేశారు.