మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంప్ లో వినాయకుడికి పూజలు !

J.SURENDER KUMAR,

వినాయక చవితి పండగ సందర్భంగా బుధవారం  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి క్యాంపు కార్యాలయంలో  వినాయకుడికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు జరిగాయి.

మంత్రి దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు పాలెపు ప్రవీణ్ శాస్త్రి, వినాయకుడి విగ్రహం ప్రతిష్టాపన, కలశ పూజలు నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురిసి పాడి పంటలతో రైతాంగం, ప్రజలు సుఖసంతోషాలతో జీవనం కొనసాగించాలని  ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని వినాయకుడిని వేడుకున్నట్టు మంత్రి అన్నారు.

👉 కాశెట్టి వాడ గణపతి కి పూజలు !

పట్టణంలోని కాశెట్టి వాడ చెరువు కట్టపై యువకులు ఏర్పాటుచేసిన మట్టి గణపతి భారీ విగ్రహానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.  యువకులు మంత్రిని ఘనంగా స్వాగతించి బాణసంచా కాల్చారు.