👉 కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మా ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న మేము రైతులకు యూరియా కొరతను సృష్టిస్తామా ? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెగడపల్లి మండలంలో శుక్రవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. …
👉 కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మేమే యూరియా కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నామంటూ ఆరోపించడం, బట్ట కాల్చి మీద వేయడం లాంటిదేనని, మీ ఆరోపణలు రాష్ట్ర రైతాంగం నమ్మరు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏనాడైనా రైతుల సమస్యల పై స్పందించారా ? అకాల వర్షాలకు, తదితర అవాంతరాలకు నష్టం సంభవించిన నా రైతాంగాన్ని పరామర్శించారా ? కనీసం పంట పొలాలను సందర్శించారా ? 33 జిల్లాలలో ఏదైనా జిల్లాలో రైతులను పరామర్శించిన సందర్భం ఉందా ? అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
👉 యూరియా కొరతపై మా ఎంపీలు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కనీసం రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది బిజెపి ఎంపీలు , మావారికి మద్దతుగా నిలిచారా ? చెప్పాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
👉 2014 నుంచి నేటి వరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది. మీరు అనేకసార్లు కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. మీరు కేంద్రంతో చర్చించి వేలాది టన్నుల యూరియాను రాష్ట్రానికి తెప్పించి ఇదిగో రైతులపై మా చిత్తశుద్ధి అని అంటూ యూరియా ను తెప్పించారా ? అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
👉 ఎనిమిది మంది ఎంపీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి యూరియా విషయంలో మీరు సాధించింది ఏమిటి ? జై శ్రీరామ్ నినాదం తో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్, రైతాంగానికి అవసరమైన యూరియా తెప్పించారా ? అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
👉 జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రిగా నేను రైతాంగానికి యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టే బాధ్యత మాది అని, రైతాంగానికి సరిపడ అవసరమైన యూరియాను కొద్ది రోజులలో తెప్పిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.