3 నెలల్లో గురుకుల పాఠశాలలకు స్టీల్ పాత్రల పంపిణీ చేస్తాం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మంత్రి బాధ్యతలు స్వీకరించిన రోజే రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో స్టీల్ పాత్రల్లో భోజనం వడ్డించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


కరీంనగర్ జిల్లా అలుగునూరులోని సోషల్ వెల్ఫేర్ బాలికల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ను సోమవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు.  ఆయనతో పాటు సంక్షేమ శాఖ కార్యదర్శి డా. అలగు వర్షిణి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్మ్టీ పమేలా సత్పతి  పాల్గొన్నారు. స్టీల్ పాత్రలు పంపిణీలో భాగంగా  COE లో  పాత్రలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి  లక్ష్మణ్ కుమార్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం మరింత మెరుగైన విద్యా మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని  హామీ ఇచ్చారు.


బోధన, బోధనేతర ఉద్యోగులకు మంత్రి సమావేశం ఏర్పాటు చేసి,బోధన ప్రమాణాలు, విద్యార్థుల ఆరోగ్యం, భోజన నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలపై సలహాలు సూచనలు చేశారు. త్వరలో రాష్ట్రంలోని మిగతా అన్ని గురుకుల పాఠశాలలకు కూడా స్టీల్ పాత్రలు పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు.


విద్యా ప్రమాణాలు, పోషకాహారం విషయంలో ఎటువంటి రాజీపడమని, ప్రతి విద్యార్థి సమానమైన, నాణ్యమైన సౌకర్యాలు పొందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా ఆధునిక సౌకర్యాలు, నూతన బోధన పద్ధతులు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.