J.SURENDER KUMAR,
గుండెపోటుతో మృతి చెందిన ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మామిడాల శంకరయ్య కుటుంబ సభ్యులను మంగళవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.
👉 నందయ్య స్వామిని పరామర్శించిన మంత్రి !

శాలపల్లి గ్రామానికి చెందిన నందయ్య స్వామి తల్లి ఇటీవల మృతి చెందారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ రాత్రి నందయ్య స్వామి ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు.
👉 ప్రమాద బాధితుడిని..

జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి భర్త లక్ష్మణ్ మంగళవారం కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జగిత్యాల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చికిత్స పొందుతున్న లక్ష్మణ్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.