42 శాతం రిజర్వేషన్ బిల్లు యధావిధిగా ఆమోదించాలి !

👉 స్థానిక సంస్థల ఎన్నికల  జాప్యం తో కేంద్రం నుండి వచ్చే  ₹1500 కోట్లు నష్టపోయే ప్రమాదముంది !

👉 మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR,


రాష్ట్రానికి సంబంధించి సామాజిక న్యాయం కల్పంలో భాగంగా ఓబీసీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న 29 శాతం కు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు శాసన సభలో బిల్లు  ఆమోదం తెలిపి గవర్నర్ కు నివేదిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపి 4 నెలలు గడుస్తుంది. 42 శాతం రిజర్వేషన్ బిల్లు యధావిధిగా ఆమోదించాలి, అని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం తో కేంద్రం నుండి వచ్చే   ₹ 1500 కోట్లు నష్టపోయే ప్రమాదముంది మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి అన్నారు.

👉 జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో శుక్రవారం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి వీడియోస్ సమావేశంలో మాట్లాడారు.


👉 సెప్టెంబర్ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని  హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2018 లో గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం అమలు చేసింది. స్థానిక సంస్థల్లో 50 శాతం మించకుంట చట్టం చేసింది.


👉 50 శాతం సీలింగ్ తొగించేలా సీఎం రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంఆర్డినెన్సు జారీ చేయాలని సంకల్పించింది.


👉 ఆర్డినెన్సు జారీ కోసం గవర్నర్కు నివేదించగా, గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు.
స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉంది.


👉 ప్రజాస్వామ్యబద్ధం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతినిధి, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి నీ కలిసేందుకు అనుమతి కోరగా సమయం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యం లో ఇంత కన్నా అవమానం ఏదీ ఉండదు.


👉 భారత ప్రజాస్వామ్య విధానాన్ని ప్రపంచమే హర్షిస్తున్నది.సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్ర పతిని కలిసేందుకు ప్రయత్నం చేస్తే రాష్ట్రపతి సమయం ఇవ్వడం పోవడం దురదృష్టకరం, అప్రజాస్వామికం.


👉 రాష్ట్రపతిని కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడం నాలుగు కోట్ల ప్రజల అధినేత రేవంత్ రెడ్డి నీ కాదు తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లు. తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో భాగమా కాదా చెప్పాలి..


👉 రామచంద్ర రావు న్యాయకోవిదుడు
రిజర్వేషన్ కోసం కొత్త గా కలిపిన కులం ఏదైనా ఉన్నదా.?


భారత దేశంలో మత పరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు. బీ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం లో స్పష్టంగా సామాజికంగా వెనకబడిన  వర్గాలకు  రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు.


👉 మైనారిటీ లలో సామాజిక వెనకబాటు కు గురి అవుతున్న  వర్గాలకు రిజర్వేషన్ 4 శాతం అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సామాజికంగా వెనకబడిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ సుప్రీం కోర్టు అనుమతించింది.


👉 రిజర్వేషన్ 29 శాతం నుండి 42 శాతం పెంచితే 13 శాతం మాత్రమే పెరుగుతుంది గతంలో ఉన్న 29 శాతం రిజర్వేషన్ స్థానంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే..హిందూ సామాజిక వెనకబాటు గురైన వారికి (25+11.20)36.20 శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది .ముస్లింలకు 1.80 శాతం రిజర్వేషన్ పెరుగుతుంది. ముస్లింలకు మొత్తం 5.80 రిజర్వేషన్ విద్యా, ఉద్యోగాల్లో మాత్రమే అమలు అవుతుంది.


👉 స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అన్ని వర్గాలకు వర్తిస్తుంది. కులాల వారీగా వర్గీకరణ లేదు అని గమనించాలి.ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అమలు కాదు అనే విషయాన్ని గమనించాలి.. బీజేపీ నాయకులు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి.


👉 ఇందిరా సహాని కేసు 50 శాతం మించకూడదు అని చెప్పినా  50 శాతం రిజర్వేషన్ సీలింగ్ తెలంగాణ రాష్ట్రంలో గతంలోనుండే 29 శాతం బీసీ,ఎస్సీ 15 శాతం, ఎస్టీ 10 శాతం మొత్తం 54 శాతం అమలు చేస్తున్నారు.


👉 ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచు అని స్పష్టంగా  పేర్కొన్నారు.తమిళనాడు 69 శాతం అమలు చేస్తుంది.9 వ షెడ్యూల్ లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలి..
కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఎక్కడ పేరు వస్తాదొ అని రిజర్వేషన్ అమల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు.


👉 రాష్ట్రపతికి, కేంద్ర మంత్రికి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం..ఇకనైనా 50 శాతం సీలింగ్  తొలగించి 42 శాతం రిజర్వేషన్ బిల్లు యధావిధిగా ఆమోదించాలి రాష్ట్ర అత్యున్నత కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచుల ఎన్నికలు నిర్వహించాలి..అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు.