నేడు ధర్మపురిలో మెగా రక్తదాన శిబిరం !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం జరగనున్నది. ‘ మన ధర్మపురి బ్లడ్ బ్యాంక్ వాట్సాప్ గ్రూప్ ‘  ఏర్పాటుచేసి బుధవారం నాటికి  పది సంవత్సరాలు పూర్తి అయితున్న సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.

ఈ శిబిరంలో విద్యార్థులకు అవగాహనా సదస్సు, ఉచిత రక్త నిర్ధారణ పరీక్ష చేయనున్నారు. గత పది సంవత్సరాల కాలంలో ఆపదలో అవసరమున్న వారికి వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేసి ఆ గ్రూపు వారు దాదాపు 3 వేల మందికి పైగా రక్తదానం చేశారు.

👉 ఈ నేపథ్యంలో పట్టణంలోని

స్థానిక వివేకానంద విగ్రహం సమీపానగల మాతృశ్రీ ఏసీ ఫంక్షన్ హాల్ లో  ఉదయం 10 గంటలకు మెగా రక్తదాన శిబిరం మొదలుకానున్నదని నిర్వాహకులు తెలిపారు.