J.SURENDER KUMAR,
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం మంథని నియోజకవర్గంలో పర్యటన (29-08-25 ) కార్యక్రమ వివరాలు !
👉 ఉదయం 9-00 గంటలకు గోపాల్ పూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి చంద్రమౌళి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు.
👉 ఉదయం 10-00 గంటలకు మంథని మునిసిపాలిటీలో CDP 48 లక్షల నిధులతో వైకుంఠ రథం / ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్ లో ప్రారంభోత్సవం చేయనున్నారు.
👉 ఉదయం 10-30 నిమిషాలకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ₹1 కోటి 20 లక్షలు విలువచేసే మంథని మండలం 84 కల్యాణ లక్ష్మి, మంథని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్ 101 CMRF చెక్కులు మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు.
👉 ఉదయం 11-30 నిమిషాలకు మంథని మున్సిపాలిటీ పరిధిలోని వినాయక మండపాలలోని దేవున్నీ దర్శించి పూజలలో పాల్గొనున్నారు.