👉 కొమరం భీమ్ ఆదివాసి భవన్‌లో ఘనంగా జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో…
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
అనాదిగా ఆదివాసి బిడ్డలు అడవి తల్లిని నమ్ముకొని అమాయకంగా నీటి నిజాయితీతో జీవనం కొనసాగిస్తూ, ప్రకృతి సంపదను కాపాడుతూ పౌరుషానికి ప్రతిరూపం ఆదివాసి బిడ్డలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ప్రపంచ ఆదివాసి దినోత్సవ (“వరల్డ్ ఇండిజీనియస్ పీపుల్స్ డే”) సందర్భంగా శనివారం కొమరం భీమ్ ఆదివాసి భవన్‌లో వైభవంగా జరిగాయి.

👉 ఆదివాసి, గిరిజన, లాంబాడ, కోయ, గోండు, చెంచు, కొలం వంటి తెగలకు చెందిన కళాకారులు బోనం, విల్లుపోటు, డప్పు, సంప్రదాయ నృత్యాలు, వివిధ కళారూపాలతో కార్యక్రమాన్ని హోరెత్తించారు.

👉 కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గిరిజనులతో కలిసి నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. డప్పు చప్పుళ్లతో, నృత్యాలతో హాజరైన జనసమూహం ఉత్సాహభరితంగా జరిగాయి.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,…

“ఆదివాసి దినోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఆదివాసీల హక్కులను కాపాడే పండుగ అని రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ₹17,168 కోట్లు STSDF కింద, ₹ 6,860 కోట్లు గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించాం. అని మంత్రి అన్నారు.
భూహక్కుల కోసం పట్టాలు, సోలార్ పంపులు, రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం” మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 మంత్రి సీతక్క మాట్లాడుతూ,..

“మన పూర్వీకుల ఆహారం శాస్త్రీయమైనది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గిరిజనులపై గర్వంగా ఉండాలి. భాష, సంప్రదాయాలు, గ్రామాల గుర్తింపును కాపాడాలి. చదువుతో పాటు సంస్కారం కూడా అంతే ముఖ్యమైంది” అని పేర్కొన్నారు.
👉 డిప్యూటీ స్పీకర్ రాంచంద్ర నాయక్ మాట్లాడుతూ..
.
“గత 10 ఏళ్లలో ఎస్టీ నిధులు దారి మళ్లించబడ్డాయి. తాండాల అభివృద్ధి, పోడు పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయి” అని అన్నారు.

👉 ఈ వేడుకలో అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, తన ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వికలాంగుల చైర్మన్ ముత్తినెని వీరయ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా.వి.ఎస్. అలగు వర్షిని, ఇతర అధికారులు, గిరిజన ప్రతినిధులు, కళాకారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి సీతక్క, సంక్షేమ కార్యదర్శి అలుగు వర్షిని మంత్రి లక్ష్మణ్ కుమార్ కు రాఖీలు కట్టారు.