👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఓదెల మల్లన్న దేవుడు చాలా శక్తివంతుడు అని, ఆలయం పురాతన చరిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినదని, మరియు స్థానిక ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితంలో దీని పాత్ర ముఖ్యమైనదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెద్దపల్లి జిల్లా, మండలంలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, మరియు శాసనమండలి సభ్యులు భాను ప్రసాద్ రావు, కూడా పాల్గొని ఆలయ కమిటీని అభినందించి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా స్వామివారి దర్శనం, సనాతన ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూ ఆలయ ఆర్థిక అభివృద్ధికి పాలకవర్గం చేస్తున్న కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ నూతన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
.