👉 డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజీ ముందు మీరు మీటింగ్ పెట్టండి, నేను కూడా వస్తాను. మీటింగ్ రోజు ఉస్మానియా క్యాంపస్ లో ఒక్క పోలీస్ ఉండవద్దు డిజిపి కి ఇదే నా ఆదేశం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.
ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ..
నేను విద్యార్థుల సమస్యలు తీర్చాలనుకుంటున్నాను, మీ సమస్యల పట్ల మీకు నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీటింగ్ లో నన్ను అడగండి అని సీఎం అన్నారు.
గొర్రెలు, మేకలు, ఇవ్వాలనుకోవడం లేదు మీరు ఐఏఎస్, ఐపీఎస్ లు, డాక్టర్లు ఇంజనీర్లు, కావాలని కోరుకుంటున్నాను, చిత్తశుద్ధి ఉన్న నేను యూనివర్సిటీకి ఎందుకు రావద్దు ? మీ సమస్యలు ఏమున్నా చెప్పండి. తీరుస్తాను. మళ్లీ యూనివర్సిటీకి వచ్చి నిధులు మంజూరు చేస్తాను.
అప్పటికప్పుడు మీకు జీవోలు ఇస్తాను. ఆ ఒక్క రోజు ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో ఉండడు. అప్పుడు విద్యా ర్థులు నిరసనలు తెలిపినా నేను ఏమీ అనను. నిరసనలు తెలిపే స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకు ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు వీరేశం, సామేల్, ఎమ్మె ల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఓయూ వీసీ కుమార్ పాల్గొన్నారు.