ఉస్మానియా ఠాగూర్ ఆడిటోరియంలో ధర్మపురి పేరు !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ , ప్రసంగం, చప్పట్లు తో మారుమోగిన ఆడిటోరియం !


J.SURENDER KUMAR,

సామాన్య కాంగ్రెస్ కార్యకర్తను, ఏమీ లేని దళిత వర్గానికి చెందిన నేను, రెండు సంవత్సరాల క్రితం ధర్మపురి ప్రజల, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా గెలిచి మహోన్నత విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం కలవడం నా అదృష్టం అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో సోమవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ఐదుగురు శాసనసభ్యులు పంచ పాండవులు నా వెంట ఉండి, ఎస్సీ ఎస్టి మైనార్టీ, దివ్యంగా సంక్షేమ మంత్రిగా నాకు అవకాశం కల్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన 20 సంవత్సరాల తర్వాత ఈ మహోన్నత విశ్వవిద్యాలయంలో మాట్లాడే అవకాశం కల్పించడం నా అదృష్టం అని మంత్రి లక్ష్మణ్ కుమార్ తన ప్రసంగంలో పేర్కొనడంతో ఠాగూర్ ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది.