పనుల జాతర కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్! 

J.SURENDER KUMAR,

ప్రభుత్వం ఆరంభించిన  పనుల జాతర  కార్యక్రమం శుక్రవారం శుక్రవారం ధర్మపురి మండలంలోనీ వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఎస్సీ ఎస్టీ పార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా అధికారులతో కలిసి పాల్గొని శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా నేరెళ్ల గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ₹ 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను,₹15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మరియు ₹12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి మంత్రి  లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
గోవిందు పల్లె గ్రామంలో ₹ 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.


అనంతరం నర్సయ్య పల్లె గ్రామంలో ₹ 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి  అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు.