J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణ కేంద్రంలో గొల్లపల్లి బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన బహుజన విప్లవ నాయకుడు, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జగిత్యాల , చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, మాజీ ఎంపీ మధు యాష్ కి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.