పరిశుభ్రత తోనే పరిపూర్ణ ఆరోగ్యం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

👉 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో..

J.SURENDER KUMAR,

పరిశుభ్రత తోనే  సమాజం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, ముఖ్య అతిథిగా జిల్లా వైద్య అధికారులతో కలిసి పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

విద్యార్థులు, పిల్లలు నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, భోజనం చేసినప్పుడే కాకుండా, ఆటలు ఆడిన ,టాయిలెట్ వెళ్లిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మంత్రి సూచించారు.
ముఖ్యంగా నులిపురుగుల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో పరిశుభ్రత కీలకం అని మంత్రి అన్నారు.

ప్రతి ఇంటిలో, పాఠశాలల్లోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని సకాలంలో టీకాలు వేయించుకోవాలని,  ఆరోగ్యంతో పాటు విద్యార్థుల మానసికాభివృద్ధికీ పరిశుభ్రత అవసరమని ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యలో మెరుగైన ఫలితాలు  సాధిస్తారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో  వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు