👉 జిల్లా సివిల్ సప్లై అధికారి పై చర్యల కు కమిషనర్ కు మంత్రి ఆదేశాలు !
👉 చింతకుంట గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు !
J.SURENDER KUMAR,
గత 15 రోజులుగా నాణ్యతలేని ( దొడ్డు ) బియ్యం గురుకుల పాఠశాల విద్యార్థులు భోంచేస్తున్నారని, సరఫరాకు బాధ్యుడైన జిల్లా సివిల్ సప్లై అధికారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ కు విద్యార్థుల సమక్షంలో మంత్రి ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు.
👉 కరీంనగర్ జిల్లా చింతకుంటలో గురుకుల బాలికల పాఠశాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు.

👉 తనిఖీ సందర్భంగా మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అన్నం ఇలా ఉంది ఏమిటి ? అంటూ ప్రిన్సిపాల్ ను మంత్రి ప్రశ్నించారు. గత 15 రోజులుగా నాణ్యతలేని దొడ్డుబియ్యంతో వంట చేస్తున్నామని ప్రిన్సిపాల్ మంత్రికి ఫిర్యాదు చేశారు.
👉 స్పందించిన మంత్రి ఆగ్రహంతో కరీంనగర్ డీ.ఎస్.ఓ.తో ఫోన్‌లో మాట్లాడి నాణ్యత ప్రమాణాలు లేని బియ్యాన్ని వెంటనే మార్చాలని డి ఎస్ ఓ ను ఆదేశించారు.

👉 హైదరాబాద్ లోని సివిల్ సప్లై కమిషనర్ చౌహన్‌తో ఫోన్‌లో మాట్లాడి, బాధ్యతా రహితంగా వ్యవహరించిన డీ.ఎస్.ఓపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. బియ్యం సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.

👉 పాఠశాల పరిసరాలు, వంటగది, అపరిశుభ్ర కాలువ, వంటకు ఉపయోగించే నీటిని , మౌలిక సదుపాయాలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ ఉద్దేశించి పలు అభివృద్ధి పనులకు మంత్రి సూచనలు సూచనలు చేశారు
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
విద్యార్థుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాజీపడే ప్రసక్తే లేదని, స్పష్టమైన ప్రణాళిక దృడ సంకల్పంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.
👉 మెస్ , పరిసరాల అభివృద్ధి, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకం, అదనపు వాటర్ ప్లాంట్ నిర్మాణం, వారం రోజులలో స్టీల్ వంట పాత్రలు అందిస్తామన్నారు.

👉 పాఠశాల ప్రహరీ నిర్మాణం (ఆక్రమణల అరికట్టడం కోసం ) క్యాంపస్ లో ఎలక్ట్రిసియన్ నియామకం, క్రీడాల అభివృద్ధి కోసం బాస్కెట్ బాల్ కోర్టు, మరియు మైదానం అభివృద్ధికి మంత్రి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ త్వరలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.