పత్తిపాక ప్రాజెక్ట్ డి పి ఆర్ కు కోటి మంజూరు !

👉 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి !

J SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గంలో పత్తిపాక ప్రాజెక్టు డి పి ఆర్ ( డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ )  కోసం ₹1.40 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ధర్మపురి నియోజకవర్గ ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ తన మాట్లాడుతూ…

ధర్మపురి నియోజకవర్గంలో 90 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి వున్నారని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి గా కొనసాగిన  హరీష్ రావు, పత్తిపాక  రిజర్వాయర్ పూర్తి చేస్తామని,  ఆ ప్రాజెక్టుకు శ్రీ లక్ష్మీనరసింహ ప్రాజెక్టు పేరు పెడతామని, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి, ఈ ప్రాంత ప్రజలను మోసం చేశాడని మంత్రి అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఏంసి పేరుతో పేదల, రైతుల భూములను నిర్బంధంగా తీసుకున్నారని ఈ ప్రాంతానికి న్యాయం చేయాల్సిందిగా మంత్రి లక్ష్మణ్ కుమార్ తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి డిపిఆర్ కోసం నిధులను మంజూరు చేయడంపై  మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

👉 ₹ 45 కోట్ల నిధులతో ఐటిఐ కళాశాల నిర్మాణంకు భూమి పూజ !

నియోజకవర్గంలోని ధర్మారం మండలంలో ₹45 కోట్ల నిధులతో నిర్మించనున్న ఐటిఐ కళాశా భవన నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.