J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం మండలంలో శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు భూమి పూజలు చేశారు.

లింగాపూర్ గ్రామంలో పర్యటించి MGNREGS నిధుల ద్వారా సుమారు ₹40 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లను మరియు ₹12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ₹16,30,500 రూపాయల విలువ 53 చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

అనంతరం పెగడపెల్లి మండలం ఐతుపెల్లి గ్రామంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద ₹ 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన హెల్త్ సెంటర్ ను అధికారులు నాయకులతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, జిల్లా అధికారులతో పాల్గొన్నారు..