J SURENDER KUMAR,
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాద్ లోని బషీర్ బాగ్ టీయూడబ్ల్యూజే కార్యాలయ ఆడిటోరియంలో, మంగళవారం ఫోటో ప్రదర్శనను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు
తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఫోటో ప్రదర్శనను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, పటేల్ రమేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి హరి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, అనీల్ తదితరులతో పాటు పలువురు సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.