ప్రతిపక్ష హోదా నాయకుడిగా కెసిఆర్ పనికిరాడు !

👉 రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ దారులను మోసం చేస్తున్నాడు !

👉 పద్మశ్రీ మందకృష్ణ మాదిగ !

J SURENDER KUMAR,

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లను పెంచకుండా ప్రజలను మోసం చేస్తున్న, ప్రతిపక్ష హోదాలో ఉన్న కెసిఆర్ ప్రశ్నించకపోవడంతో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడు అని,  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎస్ హెచ్ ఫంక్షన్ హల్ లో, బుధవారం  వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సన్నాహక సమావేశానికి  మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ధర్మపురితో పాటు చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన పెన్షన్ దారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ..

రేవంత్ రెడ్డి 20 నెలల ప్రభుత్వ పాలనపై నేను విశ్లేషించడానికి సిద్ధంగా లేను అన్నారు. కానీ వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులు దాదాపు 50 లక్షల మంది పెన్షన్లు పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తున్నదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.


పెన్షన్ దారులను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రశ్నించాల్సిన, ప్రతిపక్ష హోదా గల నాయకుడు, అసెంబ్లీలో , బయట, కానీ  కేసీఆర్ నిర్లక్ష్యం వహించడంతో  ఆయన ఆ హోదాకు పనికిరాడు అని మందకృష్ణ మాదిగ అన్నారు.

వికలాంగులకు ₹ 6 వేలు, వృద్ధులు, వితంతువుల తోపాటు, చేయూత పెన్షన్ దారులకు ₹ 4 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు… ఈ పెన్షన్ల సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్ లో జరిగే మహాగర్జన సదస్సుకు పెన్షన్ దారులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఆగస్టు 13 లోపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు పెంపు చేయాలని,  లేనిపక్షంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకే హైదరాబాద్ లో మహాగర్జన తలపెట్టమని అన్నారు. లేనిపక్షంలో ఈ మహా ధర్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి  ఉరితాడు కానున్నదని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.

👉 సన్మానం !

వికలాంగుల మహా  ధర్నా సన్నాహక సమావేశానికి హాజరైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ను ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మెన్ చిలుముల లావణ్య -లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు.