పుస్తక ఆవిష్కరణతో నా జన్మ ధన్యం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

శ్రీ ప్రభు పాద  జన్మదినం సందర్భంగా నేను శ్రీ ప్రభు పాద వ్యాస పూజ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో నా  జన్మ ధన్యమైంది, ఇది నా  పూర్వజన్మ సుకృతం, అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ను  మంత్రి లక్ష్మణ్ కుమార్  ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు మంత్రిని సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందించి మంత్రిని స్వామివారి శేష వస్త్రంతో సన్మానించారు.


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ శ్రీ ప్రభు పాద వ్యాస పూజ పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ..

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) స్థాపకులు శ్రీ ప్రభుపాదులు, కలకత్తాలోని  భక్తుడైన వైష్ణవ కుటుంబంలో పెరిగాడు, మరియు చిన్నప్పటి నుంచీ కృష్ణ చైతన్యం పట్ల లోతైన అవగాహన కలిగిన మహనీయుడు అని మంత్రి అన్నారు.

శ్రీ ప్రభు పాద జీవితం కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి అంకితం చేశాడన్నారు. ప్రభుపాద బాల్యం భక్తి వాతావరణంలోపెరిగాడని,  చిన్న వయసులోనే మృదంగ వాయించడం మరియు దేవతా  పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారున్నారు.

కృష్ణ చైతన్యం గురించి రాయడం మరియు బోధించడం, ఈ సందేశాన్ని పాశ్చాత్య ప్రపంచానికి తెలియపరచిన మహనీయుడు శ్రీ ప్రభుపాద అన్నారు.

న్యూయార్క్‌లో, అతను ఇస్కాన్‌ను స్థాపించి  దేవాలయాలు, ఆశ్రమాలు మరియు విద్యా కేంద్రాలతో  ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసి వేలాది  కోట్లాదిమంది భక్త జనంకు శ్రీకృష్ణ భక్తి చైతన్యాన్నికి ప్రతికలు చేశారన్నారు


శ్ర ప్రభుపాదుల వారసత్వంలో ఆయన విస్తృతమైన రచనలు ముఖ్యంగా భగవద్గీత , శ్రీమద్భాగవతం మరియు ఇతర వేద గ్రంథాలపై ఆయన అనువాదాలు మరియు వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆయనను స్వచ్ఛమైన భక్తుడిగా మరియు హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రపంచానికి  ముఖ్యమైన ఆధ్యాత్మిక  గురువు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 వివాహ మహోత్సవంలో..

శంషాబాద్  జిఎంఆర్ ఏరీనాలో ఆదివారం జరిగిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్  రెడ్డి వివాహ వేడుకకు లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.