రాష్ట్ర సాధనలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర కీలకం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన
ఉస్మానియా యూనివర్సిటీ  విద్యార్థుల పోరాటం, చేసిన త్యాగాలు కీలకం, చిరస్మరణీయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
.

హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆదివారం మంత్రులు, పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  ఎమ్మెల్యే మందుల సామెల్ , వైస్ చాన్సలర్  ఎం. కుమార్ ,ప్రొఫెసర్ కాసిం లు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు ₹ 90 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు  గిరిజన విద్యార్థుల సంక్షేమ  వసతి గృహ ప్రారంభోత్సవ తదితర కార్యక్రమాలకు ఈ నెల 21  రావలసిందిగా వీరు  సీఎంను ఆహ్వానించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎస్‌.టీ. హాస్టల్ ప్రారంభంతో విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు లభించనున్నాయని సీఎం అన్నారు.

👉 20 సంవత్సరాల తర్వాత.. యూనివర్సిటీకి  సీఎం !

దాదాపు 20 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణానికి  సీఎం హోదాలో ఎవరు వెళ్లలేదు.  విదేశీ విద్య డిజిటల్ తెలంగాణ విద్యా విధానంలో మార్పులు తదితర అంశాలపై సెమినార్ లో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి, ప్రసంగించామన్నారు.

2003  సంవత్సరం నుండి   మలిదశ తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడంతోపాటు, ఉస్మానియా విద్యార్థులు రాష్ట్ర సాధన కోసం  ఉద్యమాలు, ధర్నాలు, ప్రాణ త్యాగాలు, ఆందోళనలు, తదితర కార్యక్రమాలు చేసిన విషయాలు తెలిసినవే.. ఈ  నేపథ్యంలో 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లలేదు.