రేషన్ కార్డులు₹ 52 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

వెల్గటూర్ మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం 1569 నూతన రేషన్ కార్డులు, ₹ 52,25,500/-చెక్కులను  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి  పంపిణీ చేశారు.


వెల్గటూర్ మండలానికి మంజూరు అయిన 883 కొత్త రేషన్ కార్డులను మరియు ఎండపెల్లి మండలానికి మంజూరు అయిన 686 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం ₹ 37 లక్షల రూపాయలు విలువ గల 37 కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను,₹15,25,500 రూపాయల విలువ గల 50 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేస్తున్నదని,సన్న బియ్యం,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు మహాలక్ష్మి పథకం అందించి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించి,మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ప్రభుత్వ దృడ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో కార్యక్రమాలు, అభివృధ్ధి పనులు చేపడుతున్నదని, రేషన్ కార్డులలో పేర్లు నమోదు కాని వారు నమోదు చేయించుకోవాలని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 భాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీ రాములపల్లె గ్రామానికి చెందిన తునికి శ్రీనివాస్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో  మృతి చెందగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

అదే విధంగా గొల్లపెల్లి మండలం గోవిందుపల్లి  గ్రామానికి చెందిన బోనగిరి సురేష్ ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న మంత్రి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
తెలిపారు..