రేషన్‌ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక భరోసా !

👉 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో..

👉 సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందేశం !

J.SURENDER KUMAR,

గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది అని మా ప్రజా పాలన ప్రభుత్వం లో పంపిణీ చేసిన రేషన్‌ కార్డుల ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా, భావోద్వేగం అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా ప్రజలకు ఇచ్చిన సందేశం లో వివరించారు.

జగిత్యాల  పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మంత్రి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కేటాయించిన నిధులు, వినియోగం, తదితర అంశాలు తన సందేశంలో పేర్కొన్నారు.

👉70 ఏళ్లుగా పిడిఎస్‌ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి ‘‘సన్న బియ్యం’’ పంపిణీని ప్రారంభించింది. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్‌ కార్డుతో… రేషన్‌ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది.

👉 గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, ₹ 20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా… రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం.

👉‘‘ఇందిరమ్మ రైతు భరోసా’’ కింద ఎకరాకు ₹.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశాం. జూన్‌ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం.

👉 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్‌ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.

👉 వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం.
దీని కోసం  రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం.

👉 ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం.

👉 ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. గ్రీన్‌ ఛానెల్‌ లో నిధులు విడుదల చేస్తున్నాం.  ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నాం.

👉 స్థానిక సంస్థలలో…విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను  మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్‌- 1 లో 15, గ్రూప్‌-2 లో 18, గ్రూప్‌ -3 లో 26 కులాలను చేర్చాం. ఆరోగ్య శ్రీ కాంగ్రెస్‌ బ్రాండ్‌ స్కీం. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం సందేశంలో మంత్రి పేర్కొన్నారు.

👉 ఇందిరమ్మ ఇండ్లు, మహిళా ఆర్థిక సాధికారత, 
మహాలక్ష్మి పథకంలో, వ్యవసాయ శాఖ, విద్యా  శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి భూ భారతి, పౌరసరఫరాల శాఖ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహిళా స్త్రీ సంక్షేమ శాఖ తదితర శాఖలకు ప్రజాపాలన ప్రభుత్వం కేటాయించిన వేలాది కోట్ల నిధుల వివరాలు వినియోగం, లబ్ధిదారుల సంఖ్య పురోగతి తదితర అంశాలు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ పక్షాన తన సందేశంలో పేర్కొన్నారు
.

రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, జిల్లా సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న పార్లమెంటు సభ్యులకు,  శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు,  స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్‌ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అని మంత్రి లక్ష్మణ్ కుమార్ సందేశం ముగించారు.