రైతులకు సరిపడా యూరియా అందిస్తాం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలో 90% ప్రజలు వ్యవసాయం వృత్తిగా జీవనం కొనసాగిస్తున్నారని,  ముందుగా పంటలు వేసుకున్న రైతులకు యూరియా సరిపడా అందించామని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు. ఆలస్యంగా విత్తిన రైతులకు కొంత కొరత ఏర్పడిందని చెప్పారు.
రైతులకు సరిపడా యూరియా అందిస్తాం మంత్రి స్పష్టం చేశారు.

జగిత్యాల కలెక్టరేట్ భవనంలో మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్మీ డియా సమావేశంలో  గమాట్లాడుతూ..

👉 2020–24 మధ్యకాలంలో కేంద్రం నుండి రాష్ట్రానికి 27,479 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, 2024–25 లో కేంద్రం నుండి కేవలం 25,500 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని తెలిపారు.

👉 గతంతో పోలిస్తే దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, దీని కారణం ఇతర దేశాల నుండి ముడి సరుకు దిగుమతి తగ్గడమేనని మంత్రి వివరించారు.

👉 ఇప్పటికే యూరియా అంశంపై రెండుసార్లు జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నామని మంత్రి  వెల్లడించారు.

👉 ముఖ్యమంత్రి  ఇప్పటికే యూరియా సమస్యపై కేంద్ర మంత్రులను కలిసారని తెలిపారు ఇది పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉందని, ప్రతి సంవత్సరం రాష్ట్ర అవసరాలను నివేదిక రూపంలో కేంద్రానికి పంపిస్తున్నామని మంత్రి అన్నారు.

👉 కేంద్రంలో మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వారు రైతుల కోసం పెద్దలను ఎందుకు కలవడం లేదని మంత్రి ప్రశ్నించారు.

👉 కొంతమంది బీఆర్ఎస్, బిజెపి  నాయకులు నిరసనలు, ధర్నాలు చేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు.

👉 రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు సరిపడా యూరియా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

👉 యూరియా గూర్చి సమీక్ష సమావేశం !

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి, మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా యూరియా పంపిణీ వివరాలు, ఎంత మేరకు అవసరం తదితర వివరాలను అధికారుల నుంచి మంత్రి నివేదికను కోరారు.